July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*జీవితంపై విరక్తితో వృద్ధురాలి ఆత్మహత్య.. రామకృష్ణాపూర్ భగత్‌సింగ్ నగర్‌లో విషాదం*

రామకృష్ణాపూర్,జూలై 2:మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌లో ఓ వృద్ధురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భగత్‌సింగ్ నగర్‌కు చెందిన శారీఫబి (71) అనే వృద్ధురాలు తన స్వగృహంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఆమె కుమారుడు సయ్యద్ బాబా పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఫిర్యాదు ప్రకారం, శారీఫబి భర్త చాన్ మియా రెండేళ్ల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా ఉరివేసుకుని మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తీవ్ర మానసిక ఆందోళనకు గురై,తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనం అనంతరం తమ తమ గదుల్లో నిద్రించగా, తెల్లవారుజామున లేచి చూసేసరికి శారీఫబి గది తలుపులు మూసి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా, గదిలోని ఇనుప పైపుకు చున్నీతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించినట్లు కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై శ్రీధర్ తెలిపారు. వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను సేకరిస్తూ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts

శాంతిగని గని‌లో ఏఐటీయూసీ పరిశీలన

మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నిక

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

Share this