July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*భూ సర్వే ప్రక్రియ నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

మంచిర్యాల,జూలై 2:జిల్లాలో భూ సర్వే ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా,పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం భీమారం మండలం మద్దికల్ గ్రామంలో తహసీల్దార్ సదానందంతో కలిసి భూ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డుల ఆధారంగా పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామ భూముల హద్దులను స్పష్టంగా నిర్ధారించి ప్రభుత్వ భూములను కూడా గుర్తించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పట్టా, మోకా వివరాల్లో వ్యత్యాసాలుంటే ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలించి పరిష్కరిస్తామని, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే పూర్తయిన అనంతరం భూముల మ్యాపింగ్‌తో భూ వివాదాల పరిష్కారం మరింత సులభమవుతుందని పేర్కొన్నారు.అనంతరం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం, స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో అమృత్–2.0 పథకంలో జరుగుతున్న నీటి ట్యాంక్, పైప్‌లైన్ పనులను పరిశీలించి, ప్రజలకు తాగునీటి సరఫరా త్వరితగతిన అందేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Related posts

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్.

*భట్రాజు సంఘం బలోపేతానికి కృషి చేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రాజు*

Chief Editor: Satish Kumar

ఎల్ నినో’ ప్రభావం తీవ్రతరం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

Share this