July 28, 2026
Praja Telangana
తెలంగాణ

శాంతిగని గని‌లో ఏఐటీయూసీ పరిశీలన

శాంతిగని గని‌లో ఏఐటీయూసీ పరిశీలన

శాంతిగని గని‌లో ఇరవై ఐదు రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన నేపథ్యంలో, ఏఐటీయూసీ బెల్లంపల్లి శాఖ కార్యదర్శి దాగం మల్లేష్ నాయకత్వంలో గని‌లో లోతుగా పరిశీలన నిర్వహించారు. ఉత్పత్తి నిలిచిపోవడానికి కారణాలు, గని భద్రతా పరిస్థితులు, ఉత్పత్తి స్థితిని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బొగ్గు ఉత్పత్తిని త్వరగా పునఃప్రారంభించేలా కార్మికులు, అధికారులకు సూచనలు చేశారు.
ఈ పరిశీలనలో శాంతిగని గని ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి, బెల్లంపల్లి శాఖ ఉపాధ్యక్షుడు బియ్యాల వెంకటస్వామి, కాశీపేట రెండవ గని కార్యదర్శి శ్రీనివాస్, శాఖ నిర్వహణ కార్యదర్శి మంతెన రమేష్, వర్క్‌మెన్ పరిశీలకుడు పొట్ల రాయలింగు, గని కమిటీ సభ్యుడు దాడి రమేష్ పాల్గొన్నారు.

Related posts

గడప గడపలో బీజేపీ జెండా ఎగరాలి_ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్

*గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలపై డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ*

Share this