హైదరాబాద్:భట్రాజు సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రాజు, ప్రధాన కార్యదర్శి పూర్ణచందర్‌రాజు అన్నారు. ఆదివారం హైదరాబాద్ పట్టణంలోని భట్రాజు సంఘ భవనంలో నిర్వహించిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కుమురంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల జిల్లాల సంఘ నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రాజు,ప్రధాన కార్యదర్శి పూర్ణచందర్‌రాజులను జిల్లా నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.అలాగే సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశిపెద్ది రామరాజు ను కూడా మంచిర్యాల జిల్లా భట్రాజు సంఘం తరఫున సత్కరించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ భట్రాజు సమాజ అభివృద్ధి,సభ్యుల సంక్షేమం కోసం సంఘాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.నూతన కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా పనిచేసి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.సంఘo ఐక్యతతోనే సమస్యల పరిష్కారం, అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశిపిద్ది రామరాజు మాట్లాడుతూ సంఘం తరఫున మంచిర్యాల్ జిల్లా వ్యాప్తంగా బట్రాజు సంఘం బలోపేదానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశిపెద్ది రామారాజు,రాష్ట్ర కార్యదర్శి వ్యాసభట్టు రాధాకృష్ణరాజు,ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణంరాజు,మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రాజు,నాయకులు వంశీరాజు తదితరులు పాల్గొన్నారు.

