September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*సింగరేణి ఐరన్ పైపుల అక్రమ రవాణా గుట్టురట్టు.. సివిల్ సూపర్వైజర్, స్క్రాప్ వ్యాపారి సహా ఆరుగురు అరెస్ట్*

శ్రీరాంపూర్,జూన్ 28:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సింగరేణికి చెందిన రూ.4.40 లక్షల విలువైన ఐరన్ పైపుల అక్రమ రవాణా కేసును పోలీసులు ఛేదించారు. శ్రీరాంపూర్ సింగరేణి సివిల్ కార్యాలయానికి చెందిన 110 ఐరన్ పైపులను ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు.దర్యాప్తులో భాగంగా సింగరేణి సివిల్ సూపర్వైజర్ గంగళ్ల సందీప్, స్క్రాప్ వ్యాపారులతో కుమ్మక్కై ఐరన్ పైపులను అక్రమంగా తరలించినట్లు పోలీసులు గుర్తించారు. పైపులతో పాటు తరలింపుకు ఉపయోగించిన డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో సివిల్ సూపర్వైజర్‌తో పాటు ప్రైవేట్ ఉద్యోగి, డీసీఎం డ్రైవర్, మరో ముగ్గురు వ్యక్తులు, స్క్రాప్ వ్యాపారి బతినీ నరేష్ గౌడ్ కలిపి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను విచారించి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు శ్రీరాంపూర్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపారు.

Related posts

* కీటక జనిత వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు – ఇంటింటి అవగాహనతో ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమం*

ముఖ్యమంత్రిని కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

*విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాలి – జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య*

Share this