September 11, 2026
Praja Telangana
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

*అత్యవసర వేళ 112కు ఫోన్ చేయండి.. సకాలంలో సహాయం పొందండి*

హైదరాబాద్: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112 నంబర్‌కు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందాలని తెలంగాణ పోలీసులు సూచించారు. పోలీసు సేవలు, అగ్నిమాపక సహాయం, వైద్య అత్యవసర సేవలు, మహిళలు, చిన్నారుల రక్షణతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలోనూ 112 ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు.ప్రజలు 112 నంబర్‌ను తమ ఫోన్లలో భద్రపరచుకోవాలని, కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా ఈ అత్యవసర నంబర్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా 112కు సమాచారం అందించడం ద్వారా సకాలంలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.ప్రజల భద్రత, రక్షణ కోసం అందుబాటులో ఉన్న 112 అత్యవసర సేవలను అవసరమైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Related posts

*నేరాల నియంత్రణకే పోలీసుల ప్రజా సంపర్క కార్యక్రమం*

ఆదిలాబాద్: ఈ నెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు

ఎన్‌ఎస్సెస్ 7 రోజుల ప్రత్యేక శిబిరం ప్రారంభం

Share this