July 27, 2026
Praja Telangana
తెలంగాణ

*మాతా శిశు సంరక్షణ కేంద్రం, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.. వైద్య సేవల మెరుగుపై ఆదేశాలు*

మంచిర్యాల,జూన్ 25:మంచిర్యాల పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం,పాలియేటివ్ కేర్ సెంటర్, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ గురువారం ఆకస్మికంగా సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా వైద్య అధికారులు,సిబ్బందితో సమీక్ష నిర్వహించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, వసతులను పరిశీలించిన డీఎంహెచ్‌ఓ.. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు హెల్ప్ డెస్క్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు.మే నెలలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మొత్తం 342 ప్రసవాలు జరగగా,అందులో 137 సాధారణ ప్రసవాలు,205 సిజేరియన్ ప్రసవాలు జరిగినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు గర్భిణీలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, మాతా శిశు సంరక్షణ కార్డుల్లో వివరాలు నమోదు చేసి పంపించాలని, హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.అనంతరం పాలియేటివ్ కేర్ సెంటర్‌లో క్యాన్సర్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో నిర్వహిస్తున్న వివిధ రకాల వైద్య పరీక్షల ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉచితంగా 72 రకాల పరీక్షలు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా డెంగ్యూ నిర్ధారణ కోసం ఉపయోగించే ఎలిసా మిషన్‌ను పరిశీలించి, పరీక్షల ఫలితాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీధర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డాక్టర్ స్వాతి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సృజన, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ మేనేజర్ వెంకటేష్, నర్సింగ్ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

భూభారతి చట్టంను గ్రామంలో రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా అమలు చేయాలి*

Chief Editor: Satish Kumar

వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు ఇవ్వండి

*ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం అధికారుల బాధ్యత : రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి*

Share this