September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*బెల్లంపల్లి డివిజన్ కార్మికుల సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లిన టీఆర్‌వీకేఎస్ నాయకులు*

బెల్లంపల్లి,జూన్ 25:బెల్లంపల్లి డివిజన్ పర్యటనలో భాగంగా విద్యుత్ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ను టీఆర్‌వీకేఎస్ హెచ్-58 నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి డివిజన్ పరిధిలోని కార్మికుల సమస్యలను వివరించారు.టీఆర్‌వీకేఎస్ హెచ్-58 ప్రాంతీయ కార్యదర్శి ముష్క నర్సయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి డివిజన్‌లో సిబ్బంది కొరత కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది లేక పనిభారం పెరిగి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.అలాగే పాత మంచిర్యాల నుంచి వచ్చే 33 కేవీ విద్యుత్ లైన్ ఎక్కువ దూరం ఉండటం వల్ల సమస్యలు వస్తున్నాయని, అవడాలపల్లి వద్ద ఉన్న విద్యుత్ లైన్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.సమస్యల పరిష్కారానికి సీఎండీ సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌వీకేఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, ప్రాంతీయ కార్యదర్శి ముష్క నర్సయ్య, మంచిర్యాల డివిజన్ అధ్యక్షుడు బి. దామోదర్ రాజు, మంచిర్యాల డివిజన్ కార్యదర్శి ఎస్. వినోద్, బెల్లంపల్లి డివిజన్ ప్రతినిధి రవి, మంచిర్యాల జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజన్న, బెల్లంపల్లి ఇన్‌చార్జి డీఈ మల్లేశం, బెల్లంపల్లి పట్టణ సహాయ ఇంజనీర్ కాటం శ్రీనివాస్, గ్రామీణ సహాయ ఇంజనీర్ రవికుమార్, సాంకేతిక సహాయ ఇంజనీర్, బెల్లంపల్లి డివిజన్ సహాయ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

*ప్రకృతి పరిరక్షణపై అవగాహనకు “ప్రకృతిమిత్ర” జిల్లా అడహక్ కమిటీ ఎంపిక*

*గ్రీవెన్స్ డేలో ప్రజల వినతుల స్వీకరణ.. చట్టపరంగా త్వరిత పరిష్కారానికి సీపీ ఆదేశాలు*

Chief Editor: Satish Kumar
Share this