July 28, 2026
Praja Telangana
తెలంగాణ

ఆకస్మిక తనిఖీతో అప్రమత్తం చేసిన మేయర్ దర్నీ మధుకర్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మేయర్ శ్రీ దర్నీ మధుకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని, సాధ్యమైనంత వరకు రోగులకు అక్కడే ప్రాథమిక చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోగులను పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీ కార్యక్రమంలో మేయర్‌తో పాటు వైద్యులు నక్క వెంకటేష్,ఆసుపత్రి సిబ్బంది,స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

యోగతో ఆరోగ్యం.. విద్యార్థులకు అవగాహన కల్పించిన చైతన్య సుధా

క్యాతనపల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక_జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

రాష్ట్ర ప్రభుత్వం సంచార కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Share this