June 3, 2026
Praja Telangana
తెలంగాణ

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్ సేవల విస్తరణ – కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభం

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయుష్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, ఐఏఎస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ వేదవ్యాస్, డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ సైకియాట్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధ పద్ధతుల ద్వారా అందిస్తున్న వైద్య సేవలను ప్రజలకు పరిచయం చేస్తూ, వైద్య శిబిరాలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం కలెక్టర్ కార్యాలయంలో యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించగా, అనంతరం జిల్లా ఆసుపత్రిలో వైద్య శిబిరాలు కొనసాగించబడ్డాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలోనే కాకుండా జిల్లాలో కూడా ఆయుష్ సేవలు విస్తృతంగా ప్రజలు వినియోగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా దీర్ఘకాలిక మరియు చిన్న వ్యాధుల నివారణలో ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వైద్య పద్ధతులు కీలకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు తమకు అనుకూలమైన వైద్య విధానాన్ని ఎంచుకొని ఆరోగ్య సేవలను పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజ, డాక్టర్ స్పందన, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సౌజన్య, డాక్టర్ నీరజ, డాక్టర్ అంజుమన్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, సిహెచ్‌వోలు, ఆరోగ్య సిబ్బంది, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ కూడా హాజరయ్యారు.ప్రభుత్వం అందిస్తున్న ఈ వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

Related posts

సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నల్లుల సంగీత గోలి శ్రీనివాస్ నియామకం

హాజీపూర్: విధులపై బాధ్యతగా వ్యవహరించాలి

Chief Editor: Satish Kumar
Share this