October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*కార్మికుల హక్కుల సాధనకు ఐఎన్‌టీయూసీ నిరంతర కృషి*

రామకృష్ణాపూర్,అక్టోబర్ 14(నేటి ప్రజా తెలంగాణ):సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఐఎన్‌టీయూసీ పనిచేస్తోందని ఆ సంఘం సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంఘ బుచ్చయ్య తెలిపారు. ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్ ఆదేశాలు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సమ్మయ్య సహకారంతో రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి ఐఎన్‌టీయూసీ ఇన్‌చార్జి, సెంట్రల్ కమిటీ సభ్యుడు మేకల రాజయ్య ఆధ్వర్యంలో బుధవారం ఆసుపత్రి వద్ద గేట్‌ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ బుచ్చయ్య మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు, మారుపేర్ల సమస్య పరిష్కారం, పీఆర్‌పీ తదితర అంశాలు కార్మికులకు కీలకమైనవని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సంబంధిత మంత్రులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి డాక్టర్ బి. జనక్ ప్రసాద్ నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతూ వారి డిమాండ్ల సాధనకు చొరవ చూపుతున్నారని తెలిపారు.కార్మికుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై వెలువడిన ప్రకటనల పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం కార్మికులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మేకల రాజయ్య, జక్కుల తిరుపతి, ఎం. విజయరాణి, స్వప్న, సుశీల, ఇతర ఐఎన్‌టీయూసీ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

*అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు: జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ అఖిల్ మహాజన్*

*పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ: జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్*

నస్పూర్‌లో ఆటో డ్రైవర్లకు షీ టీమ్స్ అవగాహన

Share this