October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*క్యాతనపల్లిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం*

మంచిర్యాల,అక్టోబర్ 15(నేటి ప్రజా తెలంగాణ):క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బెల్లంపల్లిలోని పి. సత్యనారాయణ లయన్స్ కంటి ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ గోడిసెల సంధ్యారాణి, డాక్టర్ రాజారమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శిబిరంలో పలువురికి కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి సమస్యలు ఉన్నవారిని గుర్తించారు. అవసరమైన వారికి లయన్స్ క్లబ్ అనుబంధ సంస్థల సహకారంతో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని కోరారు.డాక్టర్ రాజారమేష్ మాట్లాడుతూ కంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించడంలో ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రతి 15 రోజులకు ఒకసారి వివిధ వార్డుల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు చైర్‌పర్సన్ సంధ్యారాణి, డాక్టర్ రాజారమేష్ దంపతులను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నులుగొండ సత్యం, కార్యదర్శి ఆశన వేణి సత్యనారాయణ, కోశాధికారి పిల్లి సతీష్, కార్యక్రమ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, లక్ష్మీకాంత్, మంద వేణుగోపాల్, నక్క శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, వేముల వెంకటేష్, గాజుల రాజేష్, గోక శ్రీనివాస్, ఆడెపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న అటవీశాఖ దాడులు*

నకిలీ భూమి పత్రాలతో మోసం – ఐదుగురు అరెస్ట్

Share this