October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*మందమర్రిని నేర రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా*

మందమర్రి,అక్టోబర్ 1(నేటి ప్రజా తెలంగాణ):రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్‌స్టేషన్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న సీపీకి మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, మందమర్రి ఎస్‌ఐ నరేష్ స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.పోలీస్‌స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కేంద్రం, రికార్డులను పరిశీలించిన సీపీ స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. 5ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అన్ని రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్ రికార్డుల నమోదు, అప్‌లోడ్ ప్రక్రియను పరిశీలించారు.మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలు, పెట్రోలింగ్, నేర నియంత్రణ చర్యలపై ఎస్‌ఐ నుంచి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ మందమర్రి సింగరేణి పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగే దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గతంలో కేసులు నమోదైన వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరాన్ని బట్టి నిబంధనల ప్రకారం గ్యాంగ్ ఫైళ్లను ప్రారంభించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మందమర్రి ప్రాంతంలో నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి నేర రహిత, మాదకద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశించారు.ఈ తనిఖీలో మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, మందమర్రి ఎస్‌ఐ నరేష్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బెల్లంపల్లి కమిషనర్గా తన్నీరు రమేశ్

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్ సేవల విస్తరణ – కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభం

Share this