క్యాతన్‌పల్లి,అక్టోబర్ 1(నేటి ప్రజా తెలంగాణ):క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని జయశంకర్ చౌక్ నుంచి ఫ్లైఓవర్ వరకు చేపట్టనున్న రహదారి విస్తరణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి.మున్సిపల్ ఛైర్పర్సన్ జి.సంధ్యారాణి, వైస్ ఛైర్పర్సన్ సరిత లాంఛనంగా పనులకు శ్రీకారం చుట్టారు.జయశంకర్ చౌక్ నుంచి ఫ్లైఓవర్ వరకు రహదారి విస్తరణతో వాహనాల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని స్థానికులు పేర్కొన్నారు. రహదారి విస్తరణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

