June 5, 2026
Praja Telangana
తెలంగాణ

*పెద్ది చిత్రపటానికి పాలాభిషేకం.. అభిమానుల సంబరాలు అంబరాన్నంటిన వేళ: యువ నాయకుడు సిద్దు*

చెన్నూరు జూన్ 4: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “పెద్ది” పట్ల అభిమానుల్లో నెలకొన్న ఉత్సాహం మంచిర్యాల పట్టణంలో స్పష్టంగా కనిపించింది. సినిమా విడుదల సందర్భంగా పట్టణంలోని సినీహార్ థియేటర్ వద్ద రామ్ చరణ్ భారీ చిత్రపటానికి అభిమానులు పాలాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ కటౌట్‌కు పూలమాలలు వేసి,టపాసులు కాల్చి, కేరింతల మధ్య సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా టీం రామ్ చరణ్ అభిమానులు సిద్దు ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.అభిమానుల హోరాహోరీ నినాదాలు,కేరింతల మధ్య సినిమా వీక్షించిన ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో వేడుకలను మరింత ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులకు రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంబంధించిన ప్రత్యేక క్యాపులు,టీ-షర్ట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన టీం రామ్ చరణ్ అభిమానుల నాయకుడు సిద్దు రామ్ చరణ్ నటించిన “పెద్ది” చిత్రం అభిమానులకు అపారమైన ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.సినిమా విడుదలతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా రామ్ చరణ్ ఇలాంటి మంచి చిత్రాలను అందిస్తూ అభిమానులను మరింత అలరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని తమ అభిమాన హీరోకు మద్దతు ప్రకటించారు. అభిమానుల ఉత్సాహంతో థియేటర్ పరిసరాలు సందడిగా మారాయి. రామ్ చరణ్‌పై తమకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుంటూ యువత పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు.

Related posts

బీసీల నాయకత్వంలో బహుజనుల రాజ్యాధికారం

హన్మకొండలో RTI బోర్డుల ఏర్పాటు త్వరలో – డి.ఆర్.ఓ హామీ

తెలంగాణ సచివాలయ సందర్శన లోప్రపంచ ముద్దుగుమ్మలు*

Share this