రామకృష్ణాపూర్,జూన్ 30:మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామంలో జరిగిన గజ్జి వెంకటేష్ అలియాస్ స్వామి (40) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి వడ్డేపల్లి రాజ్‌కుమార్ అలియాస్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు మందమర్రి సీఐ పి.రమేష్ తెలిపారు.మంగళవారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కేసు వివరాలను వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తన ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ ఎస్ఐ జే.శ్రీధర్,పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.దర్యాప్తులో భాగంగా నిందితుడిని విచారించగా,గతంలో మృతుడు వెంకటేష్ తన మేనకోడలికి నిందితుడితో వివాహం జరిపించిన విషయంలో మనసులో కక్ష పెంచుకున్నట్లు వెల్లడైందని తెలిపారు.ఇటీవల మొబైల్ ఫోన్ ధ్వంసం విషయంలో కూడా ఇరువర్గాల మధ్య వివాదం జరిగినట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో జూన్ 28న బొక్కలగుట్ట గ్రామంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా, నిందితుడు సిమెంట్ రాయితో దాడి చేయడంతో వెంకటేష్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలిపారు.నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.ప్రజలు వ్యక్తిగత వివాదాలను హింసాత్మకంగా పరిష్కరించుకోకుండా చట్టపరమైన మార్గాలను ఆశ్రయించాలని సీఐ సూచించారు.కేసు ఛేదనలో సహకరించిన ఎస్సై శ్రీధర్, పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

