July 27, 2026
Praja Telangana
తెలంగాణ

*పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య*

మందమర్రి,జూన్ 30:మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు.మంగళవారం జిల్లాలోని మందమర్రి మున్సిపల్ పరిధిలోని చత్లపూర్ గ్రామంలో గల డంపింగ్ యార్డును మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, ఇతర అధికారులతో కలిసి సందర్శించి డంపింగ్ యార్డ్, ఘన వ్యర్ధాల నిర్వహణ విధానాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, ప్రతిరోజు తడి, పొడి చెత్తను ఇంటింటి నుండి తప్పనిసరిగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని, వ్యర్ధాల నిర్వహణలో మెరుగైన చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఇటీవల అకౌంట్స్ విభాగంలో పొంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు పునరాభరణం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, కార్యాలయ భద్రత, నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కార్యాలయ ఆవరణలో మీ-సేవ కేంద్రాన్ని సందర్శించి సేవలు పొందుతున్న ప్రజలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రభుత్వ సేవలు నిమిత్తం మీ సేవా కేంద్రానికి వచ్చే ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ వసంత్, పర్యావరణ ఇంజనీర్ గోపికృష్ణ, రెవెన్యూ అధికారి కృష్ణ ప్రసాద్, మున్సిపల్ మేనేజర్ రాజేశ్వరి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*మహిళల భద్రతకు షీ టీమ్ అండ___ పెద్దంపేట గ్రామ సభలో అవగాహన సదస్సు…. వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచన: షి టీం ఎస్ఐ ఉషారాణి*

Chief Editor: Satish Kumar

*ప్రజలకు చట్టబద్ధంగా, మర్యాదపూర్వకంగా సేవలందించాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*

*పదోన్నతితో ఎస్సైగా బదిలీ.. ఆదిమూలం సత్తయ్యకు ఘన వీడ్కోలు*

Share this