September 11, 2026
Praja Telangana
తెలంగాణ

అక్రమ పశువుల రవాణాపై డీసీపీ ఉక్కుపాదం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!

మంచిర్యాల,మే19:బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందని భాస్కర్ హెచ్చరించారు.ఈ మేరకు స్లాటర్ హౌస్ నిర్వాహకులు,వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని,అందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.పశువుల కొనుగోలు, రవాణా, వధ ప్రక్రియల్లో ప్రభుత్వ నిబంధనలతో పాటు కోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనుమతులు లేకుండా అక్రమంగా పశువులను తరలించినా, చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులు, స్లాటర్ హౌస్ ప్రతినిధులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Related posts

నకిలీ భూమి పత్రాలతో మోసం – ఐదుగురు అరెస్ట్

*తహసీల్దార్ సుచరితపై ఏసీబీ దాడులు.. రూ.5 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు*

*భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి రికార్డుల పరిశీలనతో పారదర్శకంగా భూ సర్వే చేపట్టాలి: కలెక్టర్ కుమార్ దీపక్*

Share this