క్యాతనపల్లి,సెప్టెంబర్ 17(నేటి ప్రజా తెలంగాణ):తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్ పర్సన్ గొడిశెల సంధ్యారాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ప్రాధాన్యతను గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతతో పనిచేయాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ ఎన్. మురళీకృష్ణ, కౌన్సిల్ సభ్యులు, పురపాలక సంఘ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

