June 3, 2026
Praja Telangana
తెలంగాణ

మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం___ఇందిరమ్మ చీరల పంపిణీతో మరో ముందడుగు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా 52,53 డివిజన్లలో మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో 52 వ కార్పొరేటర్లు నూర్జహాన్ బేగం, 53వ డివిజన్ కార్పొరేటర్ స్రవంతి కిషోర్ ,మంచిర్యాల పట్టణ యువజన కాంగ్రెస్ (యూత్ కాంగ్రెస్) అధ్యక్షుడు అబ్దుల్ జలీల్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్బూల్ హుస్సేన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళలకు ఉపాధి అవకాశాల కల్పన, ఆర్థిక సహాయం, ఆరోగ్య భద్రత, విద్యా ప్రోత్సాహక పథకాల ద్వారా మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రాబోయే రోజుల్లో మహిళల సంక్షేమానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురానున్నట్లు వెల్లడించారు.మహిళలు స్వయం సమృద్ధితో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రతి కుటుంబ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులతో పాటు మైనార్టీ కో-ఆప్షన్ మెంబర్ ఫర్హీం మబుల్ తనుసుం, పీడీ మెప్మా సుభాష్, టీఎంసీ చంద్రయ్య, సీఓ అరుణ, ఓబీలు, ఆర్పీలు,స్థానిక నాయకులు,ప్రజాప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

“నో టు డ్రగ్స్ – ఎస్ టు ఎక్సర్‌సైజ్”తో ఆరోగ్య తెలంగాణ సాధ్యం : కలెక్టర్ కుమార్ దీపక్

శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ మాల ధారణతో హోమం నిర్వహణ

ఘనంగా కుంకుమ పూజలు తరలి వచ్చిన మహిళలు

Share this