June 3, 2026
Praja Telangana
తెలంగాణ

బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం__99 రోజుల ప్రజాపాలనలో సాయి కుంట బస్తీ దవాఖానలో ప్రత్యేక వైద్య పరీక్షలు

మంచిర్యాల,మే20:ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా సాయి కుంటలోని బస్తీ దవాఖానలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా బాలికల బరువు, ఎత్తు,రక్తంలో షుగర్ స్థాయిలు తదితర పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు.ఈ కార్యక్రమానికి హాజరైన పీడీ సుభాష్,11వ డివిజన్ కార్పొరేటర్ సుధా మల్ల హరికృష్ణ మాట్లాడుతూ యుక్తవయస్సులో ఉన్న బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. సరైన పోషకాహారం తీసుకోకపోతే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు.ప్రతి బాలిక నిత్యం ఆహారంతో పాలు,గుడ్లు, ఆకుకూరలు,డ్రైఫ్రూట్స్ వంటి పౌష్టికాహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు.అలాగే విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని,బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు.బాలికలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.అనంతరం అధిక సంఖ్యలో బాలికలు హాజరై రక్త నమూనాల సేకరణతో పాటు వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమన్,టీఎంసీ చంద్రయ్య,సీఓ అరుణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బెల్లంపల్లి, అంబేడ్కర్ విగ్రహం వద్ద చెత్తను తక్షణం తొలగించాలని డిమాండ్

బెల్లంపల్లి, నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

కలెక్టర్ కార్యాలయంలో అదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశం

Share this