మంచిర్యాల జిల్లా పరిధిలో ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.హీమోఫిలియా రక్తస్రావ వ్యాధి కావడంతో చిన్న గాయానికి కూడా ఎక్కువసేపు రక్తం ఆగకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. చిన్నపిల్లల్లో నీలికలలు, అధిక రక్తస్రావం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సమయానికి గుర్తిస్తే సరైన చికిత్సతో సాధారణ జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత ప్రారంభించగా, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ శ్రీధర్, బుక్క వెంకటేశ్వర్, రెడ్ క్రాస్ సభ్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

