July 28, 2026
Praja Telangana
తెలంగాణ

ఇందిరా మహిళా శక్తితో మహిళలకు ఆర్థిక బలోపేతం – స్వయం సహాయక సంఘాలకు రూ.53 కోట్ల రుణాల పంపిణీ

మంచిర్యాల, మే 29:మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నస్పూర్‌లో నిర్వహించిన మహిళా వారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. హాజీపూర్, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాలకు చెందిన మొత్తం 1,210 స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా రూ.53 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని,సంఘాల ద్వారా పొదుపు అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు, lమహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

అక్రమ పశువుల రవాణాపై పోలీసుల కఠిన నిఘా: డీసీపీ ఏ. భాస్కర్

డాక్టర్స్ సెల్ జిల్లా కోఆర్డినేటర్‌గా రాజ్‌కుమార్ నియామకం

Chief Editor: Satish Kumar

Share this