July 28, 2026
Praja Telangana
తెలంగాణ

గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు.. అవసరమైతే పీడీ యాక్ట్ అమలు : సీపీ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ పోచమ్మ గుడి ప్రాంతంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో అంబర్ కిషోర్ ఝా పాల్గొని ప్రజలతో సమావేశమయ్యారు. గంజాయి అక్రమ రవాణా,నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,అవసరమైతే రౌడీషీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, షీ టీమ్‌లు,భరోసా సెంటర్లు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, వ్యసనాలకు గురైన వారికి డీ-అడిక్షన్ చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రాబోయే బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డిసిపి ఎ.భాస్కర్,ఆర్.ప్రకాష్, సీఐలు,ఎస్సైలు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

సమ్మె ఉద్రిక్తతల మధ్య ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

* కీటక జనిత వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు – ఇంటింటి అవగాహనతో ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమం*

Share this