September 11, 2026
Praja Telangana
తెలంగాణ

“నో టు డ్రగ్స్ – ఎస్ టు ఎక్సర్‌సైజ్”తో ఆరోగ్య తెలంగాణ సాధ్యం : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,మే18:ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ మారథాన్–ఫిజికల్ లిటరసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఐబి చౌరస్తా నుంచి జిల్లా క్రీడాధికార సంస్థ మైదానం వరకు నిర్వహించిన మారథాన్‌లో యువతతో కలిసి డీసీపీ భాస్కర్,గుడిపేట 13వ పటాలము కమాండెంట్ వెంకటేశ్వర్లు,జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి హనుమంత రెడ్డి, ఏసీపీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. యువత ఆరోగ్యం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చి వ్యాయామం, యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండి “నో టు డ్రగ్స్ – ఎస్ టు ఎక్సర్‌సైజ్” నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యువత ముందుండాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, యువతీ యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Related posts

*వెంకటాపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌కు కొత్త దిశ.. ఉచిత వైద్య శిబిరంతో పోలీసుల సేవాభావం*

ఘనంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం

Chief Editor: Satish Kumar

*అన్నా _అక్క మెంటార్షిప్ కృత్రిమ మేధస్సుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి*

Share this