September 11, 2026
Praja Telangana
తెలంగాణ

అక్రమ పశువుల రవాణాపై పోలీసుల కఠిన నిఘా: డీసీపీ ఏ. భాస్కర్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. మంచిర్యాలలో గోరక్షక్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.పశువుల రవాణాకు వెటర్నరీ డాక్టర్ ధ్రువపత్రం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. గోరక్షక్ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా చర్యలు తప్పవన్నారు.
జిల్లావ్యాప్తంగా 7 శాశ్వత చెక్‌పోస్టులు, 15 ఆకస్మిక చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే డయల్-100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Related posts

వడదెబ్బ నివారణ,పొగాకు దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన సదస్సు:జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్

ఎండల వేళ దాహార్తిని తీర్చిన మహేష్ డాన్స్ అకాడమీ___డాక్టర్ స్వప్నిక,స్ఫూర్తి స్పాన్సర్ల సహకారంతో ఉచిత అంబలి పంపిణీ

Share this