June 3, 2026
Praja Telangana
తెలంగాణ

డెంగ్యూపై నిర్లక్ష్యం ప్రాణాంతకం.. అప్రమత్తతే రక్షణ : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మే 15 : జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డెంగ్యూ నివారణపై అవగాహన పోస్టర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభ సమయంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి వ్యాధుల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, వారానికి ఒకసారి డ్రైడే పాటించాలని తెలిపారు.జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.జిల్లాలో రాపిడ్ టెస్టులు,ఎలిసా పరీక్షలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్.అనిత, రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ రవికిరణ్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు

భారతీయ కళాకార్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా చిప్పకుర్తి శ్రీనివాస్ నియామకం…

Share this