September 11, 2026
Praja Telangana
తెలంగాణ

క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కంచుకోటగా మారింది

ఛైర్‌పర్సన్‌గా గోదిశెల సంధ్యారాణి

వైస్ ఛైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత

మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించింది.గత 50 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తూ మున్సిపాలిటీలో తన పట్టును నిలబెట్టుకుంది.
అనంతరం నిర్వహించిన ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో గోదిశెల సంధ్యారాణి ఛైర్‌పర్సన్‌గా,మిట్టపల్లి సరిత వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ ఇచ్చినా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గోదిశెల సంధ్యారాణి, వైస్ ఛైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత స్థానిక సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని, మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వారు వెల్లడించారు.

Related posts

కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో హిందూ స్మశానవాటికకు భూమి పూజ

కిక్ బాక్సింగ్‌లో రామకృష్ణాపూర్ క్రీడాకారుల సత్తా.. ఎనిమిది మందికి బంగారు పతకాలు

Share this