July 28, 2026
Praja Telangana
తెలంగాణ

విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి సైకాలజిస్టుల పాత్ర కీలకం: టిపిఏ

తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (TPA) దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాన్ని మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అడ్వొకేట్ & కౌన్సిలింగ్ సైకాలజిస్టు రంగు వేణు కుమార్ కేక్ కట్ చేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మే 9, 10 తేదీలలో హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర కన్వెన్షన్‌లో జిల్లా నుంచి పలువురు సైకాలజిస్టులు పాల్గొననున్నట్లు వెల్లడించారు.సమావేశంలో రాష్ట్ర స్థాయి సైకాలజీ కన్వెన్షన్‌ను మంచిర్యాలలో నిర్వహించేందుకు తీర్మానించారు.అలాగే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ప్రత్యేక కార్యక్రమానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా రంగు వేణు కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల అంశంపై సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావించారు.విద్యాసంస్థల్లో సైకాలజిస్టులు,కౌన్సిలర్ల అవసరం పెరిగిందని,మానసిక ఆరోగ్య సేవలందించేందుకు టిపిఏ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ సుమన చైతన్య,అడ్వైజర్ గుండేటి యోగేశ్వర్,కమిటీ సభ్యులు నాగరాజు,తాళ్లపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

భక్తి మార్గం తోనే శాంతి, సౌర బ్రాతృత్వం. మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు

వడ్డెర కాలనీలో పైప్‌లైన్ పనులపై ఆకస్మిక తనిఖీ: మేయర్ దర్ని మధుకర్

Chief Editor: Satish Kumar

తీవ్ర ఎండల ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Share this