September 11, 2026
Praja Telangana
తెలంగాణ

మల్ల్యాల మండలంలో శ్రీ స్వామి వారి జాతర ఉత్సవాలు ప్రారంభం

మల్ల్యాల మండలంలోని కొండగట్టు ముత్యంపేట గ్రామంలో వెలసిన శ్రీ అంజనేయస్వామి దేవస్థానంలో వార్షిక జాతర ఉత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు దేవస్థాన కమిటీ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.ప్రకటన ప్రకారం,మే10 నుంచి12 వరకు శ్రీ స్వామి వారి పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు,హోమాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.అలాగే మే 10 నుంచి 13 వరకు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.మే 14న యథావిధిగా ఆలయ సేవలు కొనసాగనున్నాయని దేవస్థాన కమిటీ పేర్కొంది.ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.

Related posts

Chief Editor: Satish Kumar

“తెలంగాణలో రెడ్ అలర్ట్__7 జిల్లాల్లో ఎండల తీవ్రత

“వేధింపులకు చెక్.. మహిళల రక్షణకు షీ టీమ్స్ అప్రమత్తం”_షీ టీం ఎస్ఐ ఉషారాణి

Share this