September 11, 2026
Praja Telangana
తెలంగాణ

తీవ్ర ఎండల ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏప్రిల్–మే నెలల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని తెలిపారు. అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్, సన్‌స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.ప్రజలు ఎక్కువగా నీరు,మజ్జిగ,నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఎండలో వాహనాల్లో గ్యాస్ పదార్థాలు,లైటర్లు వంటి ప్రమాదకర వస్తువులు ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు.అలాగే అవసరం లేని ప్రయాణాలు నివారించి,ఇంట్లో చల్లని వాతావరణం కల్పించుకోవాలని సూచించారు.ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని,ప్రజలు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అవగాహన పెంచుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Related posts

*అపార్ ఐడీ స్వచ్ఛందమే.. అడ్మిషన్లు, మార్క్స్ మెమోలు నిలిపివేయొద్దు: సుప్రీంకోర్టు*

*ప్రతి గింజకు న్యాయం.. నమ్నూర్_గుడిపేట కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి*

Chief Editor: Satish Kumar

*గూడెం ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు.. ఆధ్యాత్మిక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క*

Chief Editor: Satish Kumar
Share this