October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*వినాయక చవితి వేళ శాంతిభద్రతలపై పోలీసుల ప్రత్యేక నిఘా*

మంచిర్యాల,సెప్టెంబర్ 12(నేటి ప్రజా తెలంగాణ):వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మంచిర్యాల పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పాత నేరస్తులు, రౌడీలు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.పండుగ సమయంలో ప్రజల మధ్య గొడవలు, అల్లర్లు, ఇతర అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్న వారిని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుర్తించారు. వారిని ఈరోజు మంచిర్యాల తహసీల్దార్ సమక్షంలో హాజరుపరిచి బైండోవర్ చేశారు.వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పండుగ సందర్భంగా ప్రజల భద్రతకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts

*కన్నెపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ ఎగ్గడి భాస్కర్*

Chief Editor: Satish Kumar

వర్కింగ్ జర్నలిస్టులకు సింగరేణి క్వార్టర్లు కేటాయించండి

*సర్వే ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

Chief Editor: Satish Kumar
Share this