October 3, 2026
Praja Telangana
తెలంగాణ

*మృతుడు సిద్దు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నాయకులు రాజా రమేష్*

రామకృష్ణాపూర్,సెప్టెంబర్ 12(నేటి ప్రజా తెలంగాణ):రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకుడు గడ్డం సిద్దు కుటుంబాన్ని చెన్నూరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ శనివారం పరామర్శించారు. రామకృష్ణాపూర్‌లోని సిద్దు నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ సిద్దు మృతి పార్టీకి, ఆయన కుటుంబానికి తీరని లోటని తెలిపారు. విషాద సమయంలో సిద్దు కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రామిడి కుమార్, అలుగుల సత్తయ్య, యువజన నాయకులు లక్ష్మీకాంత్, ఆర్నె సతీష్, పొన్నం హరీష్, నస్పూరి శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

*సేవా స్పూర్తికి ప్రతిరూపాలు వైద్యులు___జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం*

Chief Editor: Satish Kumar

*రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రవీంద్రఖని ప్రెస్‌క్లబ్ అండ*

Chief Editor: Satish Kumar

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Share this