September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*దొరికిన మొబైల్‌ను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న 80 ఏళ్ల వృద్ధుడు.. కనకయ్యకు ఎస్సై శ్రీధర్ అభినందనలు*

రామకృష్ణాపూర్, ఆగస్టు 20: దొరికిన విలువైన మొబైల్ ఫోన్‌ను సొంతం చేసుకోకుండా పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి 80 ఏళ్ల వృద్ధుడు నిజాయితీని చాటుకున్నారు. రామకృష్ణాపూర్ శ్రీనివాస్ నగర్‌కు చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి పురం శెట్టి కనకయ్యకు మొబైల్ ఫోన్ దొరకడంతో దానిని యజమానికి చేరేలా చేయాలనే ఉద్దేశంతో రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అప్పగించారు.ఈ వయసులోనూ సామాజిక బాధ్యతతో వ్యవహరించి, దొరికిన వస్తువు తనది కాదని భావించి పోలీసులకు అప్పగించడం అభినందనీయమని స్థానిక ఎస్సై జె. శ్రీధర్ తెలిపారు. కనకయ్య చూపిన నిజాయితీ, నైతిక విలువలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని ఆయన కొనియాడారు.దొరికిన వస్తువును యజమానికి చేర్చేందుకు బాధ్యతగా వ్యవహరించిన కనకయ్యను ఎస్సై జె. శ్రీధర్ అభినందించారు. ఇలాంటి నిజాయితీ గల పౌరుల వల్ల సమాజంలో నమ్మకం, మానవత్వం మరింత బలపడుతాయని పేర్కొన్నారు.“దొరికినది మనది కాదు.. నిజమైన యజమానికి చేర్చడమే నిజమైన మానవత్వం” అనే సందేశాన్ని కనకయ్య తన చర్య ద్వారా చాటిచెప్పారు.

Related posts

*జ్యువెలరీ దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: ఎస్‌ఐ జే. శ్రీధర్*

*క్యాతన్ పల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

Chief Editor: Satish Kumar

*నస్పూర్ పరిధిలో మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించిన డీఎంహెచ్‌వో డా. నరేందర్ రాథోడ్*

Share this