September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*క్యాతన్ పల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

క్యాతనపల్లి,ఆగస్టు15(నేటి ప్రజా తెలంగాణ):క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పురపాలక సంఘ చైర్‌పర్సన్ శ్రీమతి గొడిసేల సంధ్యారాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సంధ్యారాణి మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులకు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రజలందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. తన చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం పురపాలక సంఘ కమిషనర్ ఎన్. మురళీకృష్ణ మాట్లాడుతూ, 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలంతా స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ డి. స్వామి, రెవెన్యూ అధికారి కె. సతీష్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆర్. సునిల్ కుమార్, సీనియర్ అకౌంటెంట్ ఇ. వీరన్న, వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, ఆర్‌పీలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంతర్జాతీయ అందాల పోటీలను సందర్శించే అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తపరచిన స్థానిక విద్యార్థి.

*మంచినీటి పైపులైన్ పనులు వేగవంతం చేయాలి: మేయర్ దర్ని మధుకర్*

*ప్రస్తుత భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి*

Chief Editor: Satish Kumar
Share this