June 13, 2026
Praja Telangana
తెలంగాణ

గూడెంలో పోలీసుల అవగాహన సదస్సు.. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కీలకం

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దండేపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గూడెం గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి,దండేపల్లి ఎస్సై తైసినొద్దీన్ గ్రామస్తులకు నేరాల నియంత్రణ,రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.అనుమానాస్పద వ్యక్తులు,చట్టవిరుద్ధ కార్యకలాపాల సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ సూచించారు.హెల్మెట్ వినియోగం,ట్రాఫిక్ నిబంధనల పాటింపు తప్పనిసరి అని తెలిపారు.సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఓటీపీలు,బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు.సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని,తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు.యువత గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు.కార్యక్రమంలో పోలీసు సిబ్బంది,గ్రామస్తులు,యువకులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

గోవా టూర్ పేరుతో ప్రెస్ క్లబ్ పేరు దుర్వినియోగం..అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు: క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ హెచ్చరిక

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్.. 150 గ్రాముల గంజాయి స్వాధీనం

Share this