June 3, 2026
Praja Telangana
తెలంగాణ

ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం: దోమల నియంత్రణపై కలెక్టర్ దృష్టి

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ పరిధిలో ఘనంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, ఐఏఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ, పోస్టర్ ప్రదర్శన మరియు వైద్య శిబిరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా వ్యాధి ప్రబలకుండా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దోమలు ప్రజా ఆరోగ్యానికి ప్రధాన శత్రువులని, వాటి ద్వారా మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికున్‌గున్యా, జికా వంటి వ్యాధులు వ్యాపిస్తాయని హెచ్చరించారు.ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడటం, పనికిరాని పాత్రలు, టైర్లు, కొబ్బరి బొండాలు వంటి వాటిలో నీరు నిల్వ కాకుండా తొలగించడం అవసరమని సూచించారు. వారానికి రెండుసార్లు “డ్రై డే” పాటించడం, ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రత పాటించడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చని వివరించారు.గ్రామపంచాయతీ సర్పంచులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా గిరిజన మరియు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తించాలని ఆదేశించారు.జిల్లాలో ప్రస్తుతం జీరో మలేరియా కేసులు ఉన్నందున ఆ స్థితిని కొనసాగించేందుకు ఆరోగ్య సిబ్బంది సమగ్ర సర్వేలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఉచిత రక్త పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని,అవసరమైన వారు వీటిని వినియోగించుకోవాలని తెలిపారు.ఎండాకాలంలో వడదెబ్బ నివారణ కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.కార్యక్రమంలో ఉత్తమంగా సేవలందించిన వైద్యులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్. అనిత, ప్రోగ్రాం అధికారులు,మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది,ఆశ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ముగింపులో కలెక్టర్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడంతో పాటు గ్రామ పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

Related posts

మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం___ఇందిరమ్మ చీరల పంపిణీతో మరో ముందడుగు

బెల్లంపల్లి గురుకుల విద్యార్థుల ఆందోళన

తెరుచుకున్న శబరిమల ఆలయం*

Share this