September 11, 2026
Praja Telangana
తెలంగాణ

వడ్డెర కాలనీలో పైప్‌లైన్ పనులపై ఆకస్మిక తనిఖీ: మేయర్ దర్ని మధుకర్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ, 51వ డివిజన్లలో ఉన్న వడ్డెర కాలనీలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, పైప్‌లైన్ మార్పిడి పనులను మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్డు మధ్యలో ఉన్న పాత పైప్‌లైన్‌ను తొలగించి రోడ్డు పక్కన కొత్త పైప్‌లైన్ నిర్మాణ పనులు మున్సిపల్ పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.ఈ పనుల్లో జాప్యం కారణంగా స్థానిక ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో మేయర్ క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులతో పాటు పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన నీటి సరఫరా,రవాణా సౌకర్యాలు పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు శ్రీమతి నీలి స్వప్న శ్రీనివాస్,గంగవరపు వెంకటేశ్వర్లు,పబ్లిక్ హెల్త్ డీఈ మధుకర్,మున్సిపల్ డీఈ రాజేందర్,కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు ఇతరులు పాల్గొన్నారు.

Related posts

నమ్మకం మా బలం _నాణ్యత మా లక్ష్యం_ శ్రీ గుర్రాల శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

*సైబర్‌ మోసాలకు అత్యాశ.. భయమే ఆయుధం.. అప్రమత్తతతోనే రక్షణ: డీసీపీ ఏ. భాస్కర్*

బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం__99 రోజుల ప్రజాపాలనలో సాయి కుంట బస్తీ దవాఖానలో ప్రత్యేక వైద్య పరీక్షలు

Chief Editor: Satish Kumar
Share this