October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*క్యాతనపల్లి మున్సిపాలిటీ సమస్యలపై కలెక్టర్ సానుకూల స్పందన.. చైర్ పర్సన్ డాక్టర్ సంధ్యా రాణి కృతజ్ఞతలు*

రామకృష్ణాపూర్,అక్టోబర్ 27(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని చైర్ పర్సన్ డాక్టర్ సంధ్యా రాణి తెలిపారు. గత నెల కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణను సరెండర్ చేయాలని తీర్మానం చేసినప్పటికీ, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ నెల కౌన్సిల్ సమావేశం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించవద్దని కౌన్సిలర్లందరూ కలెక్టర్‌ను కోరగా, అదనపు కలెక్టర్‌ను పంపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.గత నెల కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన కౌన్సిలర్ల గౌరవ వేతనాలు ఇప్పటివరకు చెల్లించలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే గౌరవ వేతనాలు చెల్లించాలని కమిషనర్‌కు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లకు గౌరవ వేతనాల చెల్లింపులో జాప్యం చేయడం, కౌన్సిల్‌కు తెలియకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ డాక్టర్ సంధ్యా రాణి మాట్లాడుతూ, క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కౌన్సిలర్లందరితో కలిసి పనిచేస్తామని తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. పనుల్లో కొంత జాప్యం జరిగినా మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శశి కుమార్, వెనంక శ్రీను, భూమన్న గౌడ్, జక్కబోయిన మంజుల కుమార్, కొప్పు రాజశేఖర్, ఆర్నే సంధ్యా సతీష్, కృపానందం (నాని), రంగ లక్ష్మీ రాజు, బబ్బెర స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Related posts

*వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఆర్‌డీఓ శ్రీనివాసరావు*

Chief Editor: Satish Kumar

*తవక్కల్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి.. చైర్మన్‌పై కేసులు నమోదు చేయాలి*

*ప్రజల ప్రాణాలే లక్ష్యం.. ప్రమాదకర రహదారిపై పోలీసుల తక్షణ స్పందన – దెబ్బతిన్న వంతెన వద్ద మరమ్మతులు, రాకపోకలకు భద్రతా చర్యలు*

Share this