October 28, 2026
Praja Telangana
తెలంగాణ

*పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

మంచిర్యాల,అక్టోబర్ 24 (నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రపంచ పోలియో నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్‌క్రాస్, మంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రచార కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ నిర్ణీత సమయంలో పోలియో చుక్కల మందు, అవసరమైన టీకాలు వేయించాలని సూచించారు. పోలియో వైరస్ కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపించే ప్రమాదం ఉందని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మరుగుదొడ్లు వినియోగించడం, సురక్షితమైన తాగునీటిని తీసుకోవడంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కోరారు. భారతదేశాన్ని పోలియో రహితంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీకాల అధికారి, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఎండీ రషీద్, సీహెచ్‌ఓ కాకిరాల వెంకటేశ్వర్లు, రెడ్‌క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు భాస్కర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

*ప్రైవేట్ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

*యంగ్ ఇండియా ప్రవేశ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య*

బెల్లంపల్లి గురుకుల విద్యార్థుల ఆందోళన

Share this