రామకృష్ణాపూర్,అక్టోబర్ 23(నేటి ప్రజా తెలంగాణ):క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ వద్ద కల్వర్టు నిర్మాణ పనుల నేపథ్యంలో మూడు రోజుల పాటు వాహనాల రాకపోకలను దారి మళ్లిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ వెల్లడించారు.రాజీవ్ చౌక్ వద్ద నిర్మాణ పనులు కొనసాగనున్నందున రామకృష్ణాపూర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్లే వాహనదారులు సింగరేణి ఏరియా ఆసుపత్రి మార్గంలో కాకుండా ఆర్‌కే-4 గడ్డ రోడ్డు మీదుగా గోదావరిఖనికి చేరుకోవాలని సూచించారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించుకోవాలని కోరారు.ప్రజలు, వాహనదారులు ఈ మార్పును గమనించి నిర్మాణ పనులకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు.

