October 28, 2026
Praja Telangana
తెలంగాణ

*సీఎస్ సంజయ్ జాజుకు శుభాకాంక్షలు తెలిపిన సేవాదళ్, సమాచార వికాస సమితి ప్రతినిధులు*

హైదరాబాద్,అక్టోబర్ 25(నేటి ప్రజా తెలంగాణ):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి డాక్టర్ కొదుమూరి దయాకర్ రావు, సమాచార వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి ఛాంబర్‌లో ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ పరిపాలనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వంద రోజుల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందజేసి, భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఆయన కృషి కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్ర పరిపాలనలో ప్రధాన కార్యదర్శి పాత్ర, ప్రభుత్వ శాఖల సమన్వయం, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాల్సిన ఆవశ్యకత వంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాల్లో ఉన్నతాధికారుల చొరవ కీలకమని ఈ సందర్భంగా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేసినప్పుడే పాలనపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుందని పేర్కొంటూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా పరిపాలన మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి డాక్టర్ కొదుమూరి దయాకర్ రావు, సమాచార వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి, బానోతు హరి, విజన్ ఆంధ్ర దినపత్రిక తెలంగాణ ఇన్‌చార్జి అప్పన్న వంశీ పాల్గొని ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

*విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు పోషకాహారం అవసరం*

Chief Editor: Satish Kumar

పుస్తకాలోచ్చాయి, పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీ కి చర్యలు

*సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుతో రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయ చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్*

Share this