July 28, 2026
Praja Telangana
తెలంగాణ

కన్నాల సర్వే 60లోనే సమగ్ర పాఠశాలని నిర్మించాలి ప్రజల డిమాండ్

కన్నాల సర్వే 60లోనే సమగ్ర పాఠశాలని నిర్మించాలి ప్రజల డిమాండ్

ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సమగ్ర పాఠశాలని కన్నాల శివారు సర్వే నంబర్ 60లోని ప్రభుత్వ భూమిలోనే నిర్మించాలంటూ స్థానిక నాయకులు, ప్రజలు డిమాండ్ చేశారు. శాంతి ఖని ప్రాంతంలో పాఠశాల కోసం స్థలం కేటాయిస్తున్నారన్న పుకార్లతో అక్కడ భూకబ్జాలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నదని వారు తెలిపారు.
భవిష్యత్తులో సింగరేణి విస్తరణకు అవసరమైన ప్రాంతంలో పాఠశాలను నిర్మించడం అనాలోచితమని పేర్కొంటూ, ఇప్పటికే చేసిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కన్నాల సర్వే 60లో దాదాపు యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అక్కడే పాఠశాల నిర్మించడమే సరైన నిర్ణయం అవుతుందని అభిప్రాయపడ్డారు.
సమగ్ర పాఠశాల కోసం ఈ భూమినే కేటాయించాలని జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మనీ రామ్ సింగ్, ప్రజాస్వామ్య నాయకులు, చాంద్ పాషా, మహేందర్, శ్రీనివాస్, లక్ష్మణ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

శాంతిగని గని‌లో ఏఐటీయూసీ పరిశీలన

లక్ష్మీ గణపతి ఆలయ షెడ్ల నిర్మాణానికి రూ.2.55 లక్షల విరాళం: రాచకొండ వెంకటేశ్వరరావు (బుజ్జన్న)

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)*

Share this