October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*మంచిర్యాలలో జూద స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. 10 మంది అరెస్ట్*

మంచిర్యాల,అక్టోబర్ 11(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ కాలనీలో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా మూడు ముక్కలాట ఆడుతున్న వారిపై టాస్క్‌ఫోర్స్, మంచిర్యాల పట్టణ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ ఘటనలో పది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.40,840 నగదు, 10 సెల్‌ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.మూడు ముక్కలాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నార్కోటిక్ టీమ్‌/టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు దీకొండ రమేష్, లక్ష్మణ్ రావు, మంచిర్యాల టౌన్ ఎస్‌ఐ శ్రావణ్‌తో పాటు పోలీసు సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మంచిర్యాల పట్టణానికి చెందిన రియాజ్ తాలి (45), కరుమూరి తిరుపతి (45), నడుపెల్లి మధుకర్ (57), మడసు అభిలాష్ (33), బింగి శేఖర్ (45), జీకే సలీం (50), కొప్పుల మల్లేష్ (55), బండ శేఖర్ (56), మదినేని రాజేందర్‌తో పాటు మందమర్రి మండలం యాపల్ గ్రామానికి చెందిన అల్లం నరేష్ (45) ఉన్నారు.పట్టుబడిన పది మందిని, స్వాధీనం చేసుకున్న నగదు, పేకముక్కలు, సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలతో సహా తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.

Related posts

*వెంకటాపూర్‌లో పీవీటీజీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: అదనపు జిల్లా కలెక్టర్ పి.చంద్రయ్య*

Chief Editor: Satish Kumar

అటవీ అధికారులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రైతుల కోసం న్యాయవాది ఏమాజి పోరాటం

బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం__99 రోజుల ప్రజాపాలనలో సాయి కుంట బస్తీ దవాఖానలో ప్రత్యేక వైద్య పరీక్షలు

Chief Editor: Satish Kumar
Share this