October 28, 2026
Praja Telangana
తెలంగాణ

*రామకృష్ణాపూర్‌లో 118 మందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు*

రామకృష్ణాపూర్,అక్టోబర్ 11(నేటి ప్రజా తెలంగాణ):సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన 118 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన వైద్య సలహాలు, చికిత్సకు సంబంధించిన సూచనలు అందించారు.గుండె, నాడీ వ్యవస్థ, జీర్ణకోశం, మూత్రపిండాలు, మూత్ర సంబంధిత వ్యాధులకు సంబంధించిన వైద్య విభాగాల నిపుణులు సేవలందించారు. ఏరియా ఆసుపత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (అడ్మిన్) ఎం. మధుకుమార్ పర్యవేక్షణలో, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ ఆదేశాల మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ నల్లజాల రాధాకృష్ణ శిబిరాన్ని సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్య పరీక్షలు, నిపుణుల సేవలు, ఇతర ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రావడం ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సలహాలు పొందే అవకాశం కలిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎం.డి. మదర్ సాహెబ్, మ్యాట్రన్ టి. విజయలక్ష్మి, ఓమ్ని ఆసుపత్రి వైద్య నిపుణులు, ఏరియా ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సింగరేణి పరిరక్షణకు, కార్మికుల భవిష్యత్తుకు ఐఎన్టియుసి ముందుండి పోరాడుతుంది

తెలంగాణ ఆర్ ఎం పి & పి ఎం పి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక

*రాళ్లవాగు వంతెన పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి*

Share this