రామకృష్ణాపూర్,అక్టోబర్ 8(నేటి ప్రజా తెలంగాణ):రామకృష్ణాపూర్ కార్మిక వాడల్లో నెలకొన్న మంచినీరు, పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీబీజీకేఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు సివిల్ విభాగం సీనియర్ ఓవర్సీర్ ఆర్. సుదర్శన్, ఓవర్సీర్ లవకుమార్‌కు టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి దబ్బేటి సంతోష్ వినతిపత్రం అందజేశారు.కార్మిక వాడల్లో నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పండుగల నేపథ్యంలో నీటి అవసరం మరింత పెరిగే అవకాశం ఉన్నందున సరిపడా మంచినీటిని అందుబాటులో ఉంచాలని కోరారు. బి-జోన్ పరిధిలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడంతో పాటు సివిక్ కార్మికుల కాంట్రాక్టు కాలపరిమితిని పొడిగించి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సివిల్ విభాగం కమిటీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

