మంచిర్యాల,అక్టోబర్ 8(నేటి ప్రజా తెలంగాణ):జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకు జిల్లాలో ఇంటింటి కుష్టు వ్యాధి సర్వే నిర్వహించనున్నారు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం నోడల్ అధికారులు, సూపర్‌వైజర్లకు సమీక్ష, రీ ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఆశ, ఆరోగ్య కార్యకర్తలు బృందాలుగా ఇంటింటి సర్వే నిర్వహించి కుష్టు వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించాలని సూచించారు. చర్మంపై రంగు మారిన మచ్చలు, ఆ ప్రాంతంలో స్పర్శ తగ్గడం కుష్టు వ్యాధి లక్షణాలుగా గుర్తించాలని తెలిపారు. ప్రారంభ దశలో గుర్తిస్తే ఎండీటీ చికిత్సతో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు. కుష్టు వ్యాధి వంశపారంపర్యం కాదని, శాపం లేదా పాపం కాదని స్పష్టం చేశారు.సర్వేకు ముందుగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులు, సూపర్‌వైజర్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్, సీహెచ్‌వోలు నాందేడ్ తులసీదాస్, పున్నమయ్య, పుట్ట సత్తయ్య, శ్రీనివాస్, కుష్టు వ్యాధి జిల్లా సమన్వయకర్త రమేష్, సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

