June 2, 2026
Praja Telangana
తెలంగాణ

మందమర్రిలో వరుస బైక్ చోరీలకు తెరదించిన పోలీసులు

మందమర్రి, మే 20: మందమర్రి పట్టణంలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని మందమర్రి పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, అతడి నుంచి నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.మందమర్రి సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం శాంతినగర్‌కు చెందిన గటాడి లక్ష్మీనారాయణ పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. పట్టణంలో నిర్లక్ష్యంగా పార్క్ చేసిన బైక్‌లను లక్ష్యంగా చేసుకుని మాస్టర్ కీ సహాయంతో అపహరించేవాడని తెలిపారు.వరుస బైక్ చోరీలపై కేసులు నమోదు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు బుధవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నాలుగు దొంగతనాల కేసులు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. నిందితుడి సమాచారం మేరకు స్ప్లెండర్ ప్రో, స్ప్లెండర్ ప్లస్, హెచ్‌ఎఫ్ డీలక్స్‌కు చెందిన నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు.వాహనదారులు తమ బైక్‌లను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయడంతో పాటు అదనపు లాకులు వినియోగించాలని సీఐ రమేష్ సూచించారు.ఈ కేసును ఛేదించిన ఎస్‌ఐ నరేష్‌తో పాటు సిబ్బంది రాకేష్, మహేష్, చైతన్యలను సీఐ అభినందించారు.

Related posts

రౌడీషీటర్లకు పోలీసుల ప్రత్యేక కౌన్సెలింగ్_ మాదకద్రవ్యాల పరీక్షల్లో అందరికీ నెగటివ్: సీఐ అశోక్ కుమార్

భానుడి భగభగ__45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు,జిల్లాలకు రెడ్ అలర్ట్

Share this