September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*కానిస్టేబుల్‌పై దాడి.. బీట్‌ కానిస్టేబుల్‌ సస్పెండ్‌*

వరంగల్‌,ఆగస్టు 24 (నేటి ప్రజా తెలంగాణ): ఉర్సుగుట్టలో బెటాలియన్‌ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన బీట్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత సంతోష్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.ఉర్సుగుట్ట సమీపంలోని ఓ బార్‌లో బెటాలియన్‌ కానిస్టేబుల్‌ మనోజ్‌ మద్యం సేవించి న్యూసెన్స్‌ చేస్తున్నాడని బార్‌ సిబ్బంది 112కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న బీట్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. మనోజ్‌ను షర్ట్‌ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ చెంపపై కొట్టినట్లు సమాచారం.దీంతో మనోజ్‌ సైతం సంతోష్‌రెడ్డిపై చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో సంతోష్‌రెడ్డి స్థానికుల సహాయంతో మనోజ్‌పై లాఠీతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.కానిస్టేబుల్‌పై మరో కానిస్టేబుల్‌ దాడికి పాల్పడిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఘటనపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా సంతోష్‌రెడ్డిని సస్పెండ్‌ చేయడంతోపాటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

బెల్లంపల్లి ఆటో యూనియన్ నుండి అధిక సహాయం

“తెలంగాణలో రెడ్ అలర్ట్__7 జిల్లాల్లో ఎండల తీవ్రత

*భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా*

Share this