September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*హత్యాయత్నం కేసులో రౌడీ షీటర్ A1 గణేష్ అరెస్ట్.. కత్తి స్వాధీనం*

బెల్లంపల్లి, జులై 13: బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు, రౌడీ షీటర్ A1 రసబత్తుల గణేష్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం, ఈ కేసులో ఇప్పటికే A2 నుంచి A5 వరకు నలుగురు నిందితులను జూలై 11న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అనంతరం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రసబత్తుల గణేష్‌ను బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన ఒక కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts

*గనుల మూసివేత ప్రభావిత ప్రాంతాల్లో పరిరక్షణ చర్యలు చేపట్టాలి: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి*

*రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ నిరసన*

Share this